

మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ద్వారా ‘మెగావర్స్’ (Megaverse) అనే టాక్‌షోతో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. చిరంజీవి పేరులోని ఇంగ్లిష్ స్పెల్లింగ్ ‘Chiranjeevi’లో ‘N’ అక్షరం మిస్ అయినట్లు చూపిస్తూ, ఆ స్థానంలో నెట్‌ఫ్లిక్స్ పేరును ప్రతీకాత్మకంగా పరిచయం చేశారు. ఈ వినూత్న ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ సందర్భంగా మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు ఒకే వేదికపై చూడబోతున్నారని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ‘మెగావర్స్’ టాక్‌షో త్వరలోనే ప్రారంభం కానుందని ప్రకటించింది. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రసార తేదీని వెల్లడించాల్సి ఉంది. వెండితెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించే చిరంజీవి.. ఇప్పుడు టాక్‌షో ద్వారా డిజిటల్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!