

న్యూజిలాండ్ స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2027 సీజన్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున ఆడనున్నాడు. షాదాబ్ ఖాన్ నాయకత్వంలోని ఈ జట్టు అతడితో నేరుగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 7.07 కోట్ల పాకిస్తానీ రూపాయలు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.2.38 కోట్లు. నవంబర్ 17న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) హెన్రీని విడుదల చేయగా, వారం రోజుల తర్వాత ఇస్లామాబాద్ యునైటెడ్ అతడి చేరికను ప్రకటించింది. 34 ఏళ్ల హెన్రీకి పీఎస్‌ఎల్‌లో ఇదే తొలి సీజన్ కానుంది.
ఈ ఒప్పందంతో డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఐపీఎల్ 2027 వేలంలో హెన్రీ పాల్గొనే అవకాశం లేదు. ఐపీఎల్ 2025లో సీఎస్‌కే అతడిని రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. దీంతో పీఎస్‌ఎల్‌లో లభించనున్న పారితోషికం ఐపీఎల్‌లో అందుకున్న మొత్తంకంటే సుమారు రూ.38 లక్షలు ఎక్కువ. మరోవైపు, కమిందు మెండిస్, లోకీ ఫెర్గ్యూసన్ కూడా పీఎస్‌ఎల్ జట్లతో నేరుగా ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆదిల్ రషీద్, లాన్స్ మోరిస్‌లను పీఎస్‌ఎల్ జట్లు 2027 సీజన్ కోసం ఎంపిక చేసుకున్నాయి. ఐపీఎల్, పీఎస్‌ఎల్ ఒకే సమయంలో జరిగే అవకాశాల నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లను ముందుగానే దక్కించుకునేందుకు పీఎస్‌ఎల్ ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!