

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 పదో వారంలో అనూహ్య ఎలిమినేషన్ చోటుచేసుకుంది. ఢీ డ్యాన్స్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్వేత నాయుడు హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఈ వారం నీతూ మాస్టర్, సుధీర్ లేదా రామకృష్ణ ఎలిమినేట్ అవుతారని చాలామంది భావించినప్పటికీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శ్వేత ఎలిమినేట్ అయింది. పదో వారం నామినేషన్లలో ముఖేష్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణి, అమన్, నీతూ నటరాజ్, శ్వేత, రామ్ ప్రసాద్, సుధీర్, నరేష్, రామకృష్ణ, శివకుమార్ ఉన్నారు. వీరిలో శివకుమార్, రామకృష్ణ, నీతూ మాస్టర్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే వారిలో ఒకరు బయటకు వెళ్లవచ్చనే ప్రచారం కూడా జరిగింది. అయితే చివరకు శ్వేతకు తక్కువ ఓట్లు రావడంతో ఆమె హౌస్‌ను వీడాల్సి వచ్చింది. దీంతో ఆమె ఎలిమినేషన్‌కు గల కారణాలతో పాటు రెమ్యునరేషన్ వివరాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.
ఢీ రియాలిటీ షోతో పాపులర్ అయిన శ్వేత నాయుడు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. మొదటి నుంచి హౌస్‌లో ఉన్న సభ్యులతో పోలిస్తే ఆమెకు బలమైన ఓటు బ్యాంకు లేకపోవడం ఒక కారణంగా భావిస్తున్నారు. టాస్కుల్లో చురుగ్గా పాల్గొనకపోవడం, తన ఆటతీరుతో ప్రేక్షకులపై బలమైన ముద్ర వేయలేకపోవడం కూడా ఆమెకు ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు అమన్‌తో ఆమె సాన్నిహిత్యం, అర్ధరాత్రి సంభాషణలు సోషల్ మీడియాలో కొంత నెగెటివిటీకి కారణమయ్యాయి. పదో వారంలో అందరూ నామినేషన్లలో ఉండటంతో తక్కువ ఓట్లు పొందిన శ్వేత ఐదు వారాల పాటు హౌస్‌లో కొనసాగి ఎలిమినేట్ అయింది. ఆమెకు వారానికి రూ.1.5 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన ఐదు వారాలకు కలిపి సుమారు రూ.7.5 లక్షలు అందుకున్నట్లు సమాచారం. అయితే ఈ పారితోషిక వివరాలపై అధికారిక ధ్రువీకరణ లేదు.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!