

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఆరో వారంలోకి అడుగుపెట్టడంతో హౌస్‌లో ఉత్కంఠ మరింత పెరిగింది. వీకెండ్‌లో డబుల్ ఎలిమినేషన్ జరగగా, “వైల్డ్ ఫైర్” ట్విస్ట్‌లో భాగంగా ఐదుగురు కొత్త వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి ప్రవేశించారు. దీంతో కంటెస్టెంట్ల మధ్య పోటీ మరింత పెరిగింది. సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, ఈసారి “రోడ్ బ్లాక్” టాస్క్‌తో కొత్త విధానాన్ని అమలు చేశారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఇద్దరు పాత సభ్యులను ఎంపిక చేసి పోటీ పెట్టాలి. అందులో గెలిచిన వారికి నామినేషన్లు చేసే అవకాశం లభిస్తుంది.
మొదటి రౌండ్‌లో శివకుమార్.. రోహిత్, త్రిగుణ్‌లను ఎంపిక చేయగా, టాస్క్‌లో రోహిత్ విజయం సాధించాడు. అనంతరం ఝాన్సీ, వంశీలను నామినేట్ చేయడంతో రోహిత్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు వంశీ నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ నీతూ నటరాజ్.. అమన్, ముకేశ్‌లను ఎంపిక చేసింది. ఈ పోటీలో ముకేశ్ గెలవడంతో నామినేషన్ల ప్రక్రియలో అమన్, ముకేశ్, త్రిగుణ్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ పరిణామాల మధ్య అమన్ నామినేట్ అయ్యాడు. మరోవైపు వర్షిణి సౌందరరాజన్ కూడా నామినేషన్ల జాబితాలో చేరింది. తొలిరోజు ప్రక్రియ ముగిసే సమయానికి ఝాన్సీ, వంశీ, అమన్, వర్షిణి నామినేట్ అయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగాల్సి ఉండటంతో తుది జాబితాలో మరెవరు చేరతారనే ఆసక్తి నెలకొంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!