

భారతీయ ఇతిహాస కథ ఆధారంగా తెరకెక్కిన ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ ప్రపంచ ప్రీమియర్‌ను భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం లాస్ ఏంజెలెస్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ఉన్న డేవిడ్ గెఫెన్ థియేటర్‌లో ప్రారంభించారు. అంతర్జాతీయ సినీ విమర్శకులు, కొందరు భారతీయ అతిథులు, చిత్ర బృందం ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు దర్శకుడు స్పందించారు. బ్రహ్మ ఏఐ సాంకేతికతను కేవలం లిప్-సింకింగ్ కోసమే ఉపయోగించామని, డబ్బింగ్‌ను మాత్రం నిజమైన కళాకారులే చేశారని స్పష్టం చేశారు. వివిధ భాషల ప్రేక్షకులకు పాత్రలు మరింత సహజంగా కనిపించాలనే ఉద్దేశంతో ఈ సాంకేతికతను వినియోగించినట్లు తెలిపారు. ఇంగ్లీష్‌లో జరుగుతున్న ప్రపంచ ప్రీమియర్‌తో ఈ ఇతిహాసం అంతర్జాతీయ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందనే ఆసక్తి నెలకొంది. సమీక్షలపై ఉన్న ఎంబార్గో శుక్రవారం తొలగిన తర్వాత విమర్శకుల అభిప్రాయాలు వెలువడనున్నాయి.
ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించనుండగా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్ తదితరులు సహాయక పాత్రలు పోషిస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఇతిహాస చిత్రం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో, విభిన్న ఫార్మాట్లలో విడుదల కానుంది. ప్రీమియర్ ప్రదర్శన ముగియనున్న నేపథ్యంలో, చిత్ర నిర్మాణం, నటీనటుల ప్రదర్శనలు, కథనం గురించి అంతర్జాతీయ విమర్శకులు ఎలాంటి అభిప్రాయాలు వెల్లడిస్తారోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!