
జనరల్

భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో పాటు ఫ్లైదుబాయ్ విమాన సిబ్బందిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. విమాన ప్రయాణంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలు, వృత్తిపరమైన నైపుణ్యాన్ని గుర్తిస్తూ యూఏఈ అధ్యక్షుడు వారికి ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్‌కు చెందిన FZ1073 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో తోటి పైలట్ చేతిలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గాయపడినప్పటికీ, ఆయన విమానాన్ని సమర్థంగా నియంత్రించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న 172 మంది ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారు. క్లిష్ట సమయంలో చూపిన తెగువ, బాధ్యతాయుతమైన చర్యలకు గుర్తింపుగా యూఏఈ ఈ అరుదైన గౌరవాన్ని అందించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!