

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ హౌస్‌లో వాడివేడిగా సాగింది. కంటెస్టెంట్ల మధ్య వాదనలు, జడ్జీల నిర్ణయాలు, ముకేష్ గౌడ జోక్యంతో ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. నామినేషన్ అవకాశం పొందిన రామ్ ప్రసాద్.. శివ, శ్వేతలను ఎంపిక చేశాడు. ఈ సందర్భంగా ముకేష్ జోక్యం చేసుకోవడంతో చర్చ వాగ్వాదానికి దారితీసింది. చివరికి జడ్జీలు శ్వేతను సేవ్ చేసి, శివ నామినేషన్‌ను ఆమోదించారు. దీంతో శివ మరోసారి ఎలిమినేషన్ ప్రమాదంలో పడ్డాడు.
ఆ తర్వాత రోహిత్.. నరేష్‌ను నామినేట్ చేశాడు. ఇతరులు పూర్తి స్థాయిలో ప్రయత్నించడం లేదని చెప్పే నరేష్, తన విషయంలోనూ అదే ప్రమాణాన్ని పాటిస్తున్నాడా అని ప్రశ్నించాడు. మరోవైపు రామకృష్ణ వర్షిణిని నామినేట్ చేయగా, జడ్జీలు అతడు చెప్పిన కారణాలతో ఏకీభవించారు. అనంతరం ఝాన్సీ శివను నామినేట్ చేస్తూ గతంలో జరిగిన టాస్క్‌లో అతడి ప్రవర్తనను ప్రస్తావించింది. శ్వేత తనకు వచ్చిన అవకాశంలో ఝాన్సీని నామినేట్ చేసింది. ఇద్దరి వాదనలను పరిశీలించిన జడ్జీలు శ్వేత చెప్పిన కారణాలను అంగీకరించి ఝాన్సీని నామినేషన్లోకి పంపించారు. ప్రక్రియ చివర్లో ముకేష్ జడ్జీలతో చర్చించాల్సిన సమయంలో రెడ్ టీమ్ సభ్యులతో మాట్లాడటంపై బిగ్‌బాస్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం జడ్జీలు చర్చించి వంశీని నేరుగా నామినేట్ చేశారు.
ఎనిమిదో వారం నామినేషన్స్ ముగిసే సమయానికి వంశీ, సుధీర్, రామ్ ప్రసాద్, వర్షిణి, శివ, ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ కలిపి మొత్తం ఎనిమిది మంది ఎలిమినేషన్ ప్రమాదంలో నిలిచారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా వీరిలో ఎవరు సురక్షితంగా ఉంటారు, ఎవరు హౌస్‌ను వీడతారనే ఉత్కంఠ నెలకొంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!