

బిగ్‌బాస్ తెలుగు 10 తొమ్మిదో వారం ఓటింగ్‌లో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. మొత్తం 10 మంది కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉండగా, ముఖేష్ గౌడ్ 37.01 శాతం ఓట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి ఇప్పటివరకు 21,558 ఓట్లు వచ్చినట్లు తాజా ఓటింగ్ ట్రెండ్స్ వెల్లడిస్తున్నాయి. దేబ్జానీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో కొంత నెగెటివిటీ ఎదురైనప్పటికీ, ముఖేష్‌కు ఉన్న అభిమానుల మద్దతు బలంగా కనిపిస్తోంది. వంశీ 9.54 శాతం ఓట్లతో 5,557 ఓట్లు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. దేబ్జానీ 7.44 శాతం (4,334 ఓట్లు)తో మూడో స్థానంలో, వర్షిణి 7.15 శాతం (4,165 ఓట్లు)తో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.
మధ్యస్థానాల్లో ఉన్న కంటెస్టెంట్ల మధ్య కూడా గట్టి పోటీ కనిపిస్తోంది. సుధీర్‌కు 7 శాతం (4,077 ఓట్లు), శివ్ కుమార్‌కు 6.96 శాతం (4,054 ఓట్లు), అమన్‌కు 6.61 శాతం (3,849 ఓట్లు), నరేష్‌కు 6.45 శాతం (3,756 ఓట్లు) వచ్చాయి. ఇక రామ్ ప్రసాద్ 5.95 శాతం (3,464 ఓట్లు), నీతూ 5.9 శాతం (3,436 ఓట్లతో) చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే డబుల్ ఎలిమినేషన్‌లో వీరిద్దరూ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సింగిల్ ఎలిమినేషన్ జరిగితే నీతూ ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఓటింగ్ ముగియడానికి ఇంకా రెండు రోజులు 15 గంటల సమయం ఉండటంతో చివరి నిమిషాల్లో ఓట్ల శాతాలు, స్థానాలు మారే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!