

మహిళా రిజర్వేషన్ల అమలుకు వీలుగా లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ప్రకారం లోక్‌సభతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్యను 50 శాతం పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన అదనపు స్థానాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఈ రిజర్వేషన్లలో భాగంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు కూడా ప్రత్యేక కేటాయింపులు చేయనున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళలకు కేటాయించిన నియోజకవర్గాలను రొటేషన్ పద్ధతిలో మార్చే విధానాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పర్యవేక్షించి, అమలు చేసేందుకు ప్రత్యేక డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!