

విడుదల తేదీ: నవంబర్ 14, 2025
నటీనటులు: అనీష్, జాన్విక, ఆరోహి నారాయణ్, రాజీవ్ కనకాల, ప్రమోదిని తదితరులు
దర్శకుడు: అనీష్
నిర్మాత: విజయ్ ఎం. రెడ్డి
సంగీతం: ఆనంద్ రాజావిక్రమ్
సినిమాటోగ్రఫీ: హర్షవర్ధన్
ఎడిటర్: శరత్ కుమార్
అక్షయ్ (అనీష్)–సనా (ఆరోహి నారాయణ్) కాలేజ్ స్టూడెంట్స్. సనా అతనిపై వన్‌సైడ్ లవ్‌లో పడుతుంది. అక్షయ్ తండ్రి (రాజీవ్ కనకాల) పోలీస్ ఆఫీసర్, ప్రేమ మీద అసలు నమ్మకం లేని వ్యక్తి. ఈ పరిస్థితుల్లో అక్షయ్ ఎలా సనాతో ప్రేమలో పడతాడు? క్రికెటర్ కావాలనే అతని లక్ష్యం ఏమవుతుంది?
ఇదే సమయంలో నక్షత్ర (జాన్విక) అనే ఫిజియోథెరపిస్ట్ అక్షయ్ జీవితంలోకి రావడంతో అతను ఆమెపై ప్రేమ పెంచుకుంటాడు. ఈ ముగ్గురి మధ్య జరిగే సంఘటనలు, అక్షయ్ ఎదుర్కొన్న పరిస్థితులు కథగా సాగుతాయి.
సినిమాలోని యూత్ ఫుల్ ఎలిమెంట్స్ బావున్నాయి. లవ్‌లో వచ్చే కష్టాలు, టాక్సిక్ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన హార్ష్ రియాలిటీస్‌ను బాగా చూపించారు.
హీరో అనీష్ నటన సహజంగా ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో బాగానే చేశారు. హీరోయిన్స్ ఆరోహి, జాన్వికలు తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. రాజీవ్ కనకాల పోలీస్ పాత్రలో మెప్పించారు.
సెకండ్ హాఫ్ ఎమోషనల్ ఎలిమెంట్స్‌ను దర్శకుడు కొంతవరకు బాగా హ్యాండిల్ చేశాడు.
కథ, కథనాలు చాలా వరకు రెగ్యులర్‌గా సాగాయి. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ స్క్రీన్‌ప్లే ఆకట్టుకునేలా రాయబడలేదు.
హీరో–హీరోయిన్స్ మధ్య ట్రాక్‌ను మరింత బలంగా నిర్మించి ఉంటే సినిమా ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేది. ఫస్ట్ హాఫ్‌లో కొద్దిపాటి ఫన్ సీన్స్ కొంతవరకు వర్క్ అయినా, మిగతా సీన్స్ సాధారణంగా సాగాయి. సెకండ్ హాఫ్ మరింత స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ అవసరమైంది.
దర్శకుడిగా అనీష్ కొన్ని చోట్ల బాగానే చేశాడు కానీ రచయితగా వీక్ అయ్యాడు. సంగీతం సరిపడా ఉంది. ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్‌గా ఉండాలి. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
లవ్ ఓటీపీ ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్. కొన్ని ఫన్ మూమెంట్స్, లవ్ సీన్స్, క్లైమాక్స్ ఎమోషన్ బాగా పనిచేశాయి. అయితే, బలహీనమైన కథనం, పాత్రల లోతు లేకపోవడం సినిమాకి మైనస్. మొత్తానికి, యువ ప్రేక్షకులకు కొంతవరకు కనెక్ట్ అయ్యే లవ్ డ్రామా.
మా రేటింగ్: 2.75/5











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!