15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హుషార్ పిట్టలు రివ్యూ: చివరికి సినిమా ఎలా ఉందంటే?

Writer: Harika S 11:38 AM, 15 ఆగస్టు, 2026
హుషార్ పిట్టలు రివ్యూ: చివరికి సినిమా ఎలా ఉందంటే?

విడుదల తేదీ: ఆగస్టు 15, 2026

నటీనటులు: వాసవి గణేశన్, అన్ష్, గోవర్ధన్ రెడ్డి, రమేష్ నకిరేకంటి, అంజి తదితరులు

దర్శకత్వం: భిక్షు

నిర్మాత: వెంకట్ యాదవ్

సంగీత దర్శకుడు: చరణ్ అర్జున్

సినిమాటోగ్రఫీ: రుద్ర సాయి

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్

సంబంధిత లింక్స్: ట్రైలర్

కథ:
‘హుషార్ పిట్టలు’ కథ చిన్న గ్రామానికి చెందిన రవి (అన్ష్), చిట్టి (వాసవి గణేశన్) అనే ఇద్దరు టీనేజర్ల చుట్టూ తిరుగుతుంది. రవి పదో తరగతి పూర్తి చేసి ఇంటర్‌లోకి వస్తాడు. చిట్టి మాత్రం ఇంకా స్కూల్‌లోనే ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆకర్షణ ఏర్పడి, వారు కొన్ని హద్దులు దాటి ప్రవర్తించడం మొదలుపెడతారు. అయితే తమ పిల్లలపై ఎంతో నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రులు వారు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో రవి, చిట్టి తీసుకునే నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయి? తల్లిదండ్రుల మాట విని వారు మారారా? ఈ అనుభవం ద్వారా వారు ఏం తెలుసుకున్నారు? టీనేజ్ యువత ప్రవర్తనపై దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం ఏంటి? అనే అంశాలను సినిమా ద్వారా చూపించారు.

ప్లస్ పాయింట్లు:
‘హుషార్ పిట్టలు’లో మొదటగా చెప్పుకోవాల్సిన అంశం దర్శకుడు భిక్షు చేసిన బోల్డ్ ప్రయత్నం. టీనేజ్ యువత ప్రస్తుత పరిస్థితులు, వారు తీసుకునే నిర్ణయాలు, వాటి ప్రభావం వంటి అంశాలను నేరుగా చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రస్తుత తరంలో టీనేజ్ పిల్లలు కొన్ని విషయాల ప్రభావానికి ఎలా లోనవుతున్నారు అనే అంశాన్ని స్పష్టంగా చూపించారు. దీనికి కామెడీని జోడించడం కూడా సినిమాకు ప్లస్‌గా నిలిచింది. ఫస్టాఫ్, సెకండాఫ్‌లో కామెడీతో పాటు ఆలోచింపజేసే సన్నివేశాలు ఉన్నాయి. వాసవి గణేశన్ తన తొలి సినిమాతోనే ధైర్యంగా నటించి ఆకట్టుకున్నారు. అన్ష్ కూడా తన పాత్రలో సహజంగా నటించాడు. అతని లుక్స్, నటన బాగున్నాయి. తల్లిదండ్రుల పాత్రల్లో గోవర్ధన్ రెడ్డి, రమేష్ నకిరేకంటి మంచి నటనను కనబరిచారు. ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్లు:
సినిమాలో సందేశం బాగున్నప్పటికీ దాన్ని చెప్పే క్రమంలో చూపించిన బోల్డ్ కంటెంట్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఇద్దరు టీనేజర్ల మధ్య సంబంధాన్ని చూపించిన విధానం కొన్ని సందర్భాల్లో మితిమీరినట్టుగా అనిపిస్తుంది. సోలోగా సినిమా చూసే ప్రేక్షకులకు ఈ అంశం పెద్ద సమస్య కాకపోయినా, ఫ్యామిలీ ఆడియెన్స్‌తో కలిసి చూడాలనుకునేవారికి కొన్ని సన్నివేశాలు ఇబ్బందికరంగా అనిపించే అవకాశం ఉంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో లాజిక్ లోపాలు కనిపిస్తాయి. వీటిని మరింత వివరంగా చూపించాల్సిన అవసరం ఉంది. మరోవైపు, కథాంశం ముందుగానే కొంత అర్థమయ్యేలా ఉండటంతో కథనం కొన్ని చోట్ల ఊహించగలిగే విధంగా సాగుతుంది.

సాంకేతిక విభాగం:
‘హుషార్ పిట్టలు’ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో పనిచేసిన వారిలో చాలామంది కొత్తవారే అయినప్పటికీ ప్రాజెక్ట్‌ను చక్కగా రూపొందించారు. ముఖ్యంగా చరణ్ అర్జున్ సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలను డిజైన్ చేసిన విధానం, పాత్రలకు తగ్గట్టుగా ఉపయోగించిన కొన్ని బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ బాగున్నాయి. వాటిలోని సాహిత్యం కూడా కొన్ని సందర్భాల్లో మెప్పిస్తుంది. రుద్ర సాయి కెమెరా వర్క్ డీసెంట్‌గా ఉంది. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ కూడా సినిమాకు అనుగుణంగా ఉంది. దర్శకుడు భిక్షు తాను చెప్పాలనుకున్న సందేశాన్ని స్పష్టంగా అందించడంలో సక్సెస్ అయ్యారు. అయితే కథను మరింత హార్డ్ హిట్టింగ్‌గా చూపించే ప్రయత్నంలో బోల్డ్ కంటెంట్ కొంత హద్దులు దాటినట్లు అనిపిస్తుంది. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ అంశాన్ని పక్కన పెడితే దర్శకుడి పని మెప్పిస్తుంది.

తీర్పు:
మొత్తంగా చూసుకుంటే ‘హుషార్ పిట్టలు’లో దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం బాగా వర్కౌట్ అవుతుంది. ప్రస్తుత తరంలో టీనేజ్ యువత ఎదుర్కొంటున్న పరిస్థితులు, వారి నిర్ణయాలు, వాటి ప్రభావాన్ని సినిమా ద్వారా స్పష్టంగా చూపించారు. లీడ్ జంటతో పాటు తల్లిదండ్రుల పాత్రల్లో నటించిన వారి పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీ సినిమాకు బలంగా నిలిచాయి. అయితే బోల్డ్ సన్నివేశాలు, కొన్ని లాజిక్ లోపాలు, ఊహించగలిగే కథనం కొంత నిరాశపరుస్తాయి. వీటిని పక్కన పెడితే ‘హుషారు పిట్టలు’ ఒక సందేశాత్మక యూత్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుంది.

రేటింగ్: 2.5/5

రేటింగ్:

2.5/5

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మకుటం మూవీ రివ్యూ: విశాల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ

అగధ మూవీ రివ్యూ

అగధ మూవీ రివ్యూ

కేజెక్యూ మూవీ రివ్యూ

కేజెక్యూ మూవీ రివ్యూ

'డీసీ' మూవీ రివ్యూ: లోకేష్ కనగరాజ్ నటుడిగా మెప్పించాడా?

'డీసీ' మూవీ రివ్యూ: లోకేష్ కనగరాజ్ నటుడిగా మెప్పించాడా?

ట్యాగ్లు
హుషార్ పిట్టలు రివ్యూహుషార్ పిట్టలు మూవీవాసవి గణేశన్అన్ష్తెలుగు మూవీ రివ్యూతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ: వరుణ్ తేజ్ హిట్ కొట్టేశాడా?

కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ: వరుణ్ తేజ్ హిట్ కొట్టేశాడా?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రికవరీలో తన జీవితం ఇలా ఉందంటున్న రష్మిక
సినిమాలు

రికవరీలో తన జీవితం ఇలా ఉందంటున్న రష్మిక

నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్
సినిమాలు

నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్

‘టాక్సిక్’ ట్రైలర్‌పై రిషికా సింగ్ తీవ్ర విమర్శలు
సినిమాలు

‘టాక్సిక్’ ట్రైలర్‌పై రిషికా సింగ్ తీవ్ర విమర్శలు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, ఖర్గే!
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, ఖర్గే!

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు
క్రీడలు

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్
జనరల్

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్

కేటీఆర్: దేశాన్ని వెనక్కి నెడుతున్నది నాయకత్వ లోపమే
జనరల్

కేటీఆర్: దేశాన్ని వెనక్కి నెడుతున్నది నాయకత్వ లోపమే

హుషార్ పిట్టలు రివ్యూ: చివరికి సినిమా ఎలా ఉందంటే?
రివ్యూలు

హుషార్ పిట్టలు రివ్యూ: చివరికి సినిమా ఎలా ఉందంటే?

ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...
క్రీడలు

ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...

ఇండోనేషియాలో భారీ భూకంపం...
జనరల్

ఇండోనేషియాలో భారీ భూకంపం...

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష.. వైరల్‌గా మారిన వీడియో
సినిమాలు

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష.. వైరల్‌గా మారిన వీడియో

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష 2’పై విమర్శలు.. అసలు కారణమేంటి?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష 2’పై విమర్శలు.. అసలు కారణమేంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!