
న్యూస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు ఒక రోజు మాత్రమే హాజరయ్యే యోచనలో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీకి వెళ్లి ఇప్పటికే ఆరు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అసెంబ్లీ కార్యకలాపాల్లో తమ వైఖరిని తెలియజేయడం, సభ్యత్వానికి సంబంధించిన అంశాలపై స్పష్టత కోసం ఒక్కరోజు సభకు హాజరవాలని వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తుది నిర్ణయం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!