

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని పంట కొనుగోళ్లపై లెక్కలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని నిరూపిస్తే ఏ శిక్షకైనా తాము సిద్ధమని ఆయన సవాలు విసిరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన రైతుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు లేవని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. గన్నీ బ్యాగుల కొరత, తూకం లోపాలు, ఆలస్యాలు వంటి సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం చెప్పుతున్న 80 శాతం కొనుగోళ్లు వాస్తవానికి 30 శాతం కూడా లేవని విమర్శించారు.
ఈ సమస్యను కేబినెట్‌లో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే క్షేత్రస్థాయిలో ఒత్తిడి పెంచుతామని కేటీఆర్ హెచ్చరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!