
జనరల్

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు స్టేట్‌మెంట్‌ను నమోదు చేసింది. ఈ కేసులో ఆయనను సాక్షిగా విచారించిన అధికారులు, ఇతర రాష్ట్రానికి చెందిన బ్యూరోక్రాట్‌ను ప్రశ్నించిన తొలి సందర్భంగా దీనిని పేర్కొంటున్నారు.
2023లో ఏబీ వెంకటేశ్వరరావు కాల్ డేటా రికార్డులను నిందితులు సేకరించినట్లు దర్యాప్తులో గుర్తించిన నేపథ్యంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పూర్తి వివరాలను వెలికితీసే దిశగా సిట్ దర్యాప్తును కొనసాగిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!