
క్రీడలు

విజయ్ తనకు కేటాయించిన అధికార భద్రత, కాన్వాయ్ వాహనాలను ప్రస్తుతం స్వీకరించబోనని స్పష్టం చేసినట్లు సమాచారం. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు విజయ్‌కు కేటాయించిన కాన్వాయ్ వాహనాలను వెనక్కి తీసుకున్నారు. స్పష్టమైన మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి హోదా అధికారికంగా ఖరారైన తర్వాతే ప్రభుత్వ భద్రతను స్వీకరిస్తానని విజయ్ అధికారులకు తెలిపినట్లు తెలుస్తోంది.
తమిళనాడు రాజకీయాల్లో ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారిక గుర్తింపు రాకముందే ప్రభుత్వ సౌకర్యాలను వినియోగించకూడదన్న సందేశాన్ని విజయ్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు టీవీకే ప్రయత్నాలు కొనసాగుతుండటంతో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!