

తమిళనాడు రాజకీయాల్లో ‘ప్రాజెక్ట్ మేఘాలయ’ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఎలైయరాజా తన పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని రూ.35 కోట్ల ఆఫర్ ఇచ్చారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రణాళికను ‘ప్రాజెక్ట్ మేఘాలయ’ అనే కోడ్ పేరుతో నిర్వహించారని ఆయన పేర్కొనడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఆరోపణలు ఇప్పటివరకు అధికారికంగా నిరూపితం కాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా ఫోన్ కాల్ రికార్డులు, డిజిటల్ కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. యూట్యూబర్ తిరునావుక్కరసు, సర్వే సంస్థతో అనుబంధం ఉన్న వ్యక్తులు, సీనియర్ జర్నలిస్టు విజయన్ను కూడా విచారించారు. అధికార టీవీకే ప్రభుత్వం అస్థిరపరిచే కుట్ర జరిగిందని ఆరోపిస్తుండగా, ప్రతిపక్షాలు ఈ ఆరోపణలను ఖండిస్తూ నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాతే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!