
టెక్నాలజీ

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. నటి, టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు కోయల్ మల్లిక్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభకు ఎన్నికైన నాలుగు నెలలకే ఆమె పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజీనామా అనంతరం ఆమె న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలవడంతో బీజేపీలో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది.
తాజా పరిణామంతో టీఎంసీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎంపీల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో పెద్దల సభలో టీఎంసీ బలం 13 నుంచి 9కు తగ్గింది. కోయల్ మల్లిక్ భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఆమె బీజేపీలో చేరే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!