

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఐరోపా దేశాల్లో తీవ్ర దౌత్య కల్లోలానికి దారితీశాయి. గ్రీన్లాండ్కు మద్దతు ఇస్తున్న దేశాలపై కఠిన హెచ్చరికలు జారీ చేస్తూ, భారీ సుంకాలు విధిస్తామని బెదిరించారు. ఫ్రాన్స్‌పై ఏకంగా 200 శాతం టారిఫ్ విధిస్తానని ప్రకటించడం యూరప్–అమెరికా సంబంధాలను మరింత ఉద్రిక్తంగా మార్చింది.
చాగోస్ ద్వీపాలను మారిషస్‌కు అప్పగించాలన్న బ్రిటన్ నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. డీగో గార్షియా ద్వీపం అమెరికా రక్షణకు అత్యంత కీలకమని పేర్కొంటూ, ఈ నిర్ణయం చైనా, రష్యాలకు బలమిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలే గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలన్న తన అభిప్రాయానికి కారణమని ఆయన స్పష్టం చేశారు.
ఈ దౌత్య ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా క్షీణించాయి. ఐరోపా మార్కెట్లతో పాటు భారత్‌లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ భారీగా నష్టపోయాయి. ఒక్కరోజులోనే పెట్టుబడిదారుల సంపద రూ.9.86 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఐరోపా కూటమి ప్రతీకార సుంకాలు, వాణిజ్య ఒప్పందాల నిలిపివేత, అమెరికా సంస్థలపై ఆంక్షలు వంటి చర్యలకు సిద్ధమవుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!