

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మనం గెలవబోతున్నాం.. ఇంకా పెద్ద విజయాలు సాధించబోతున్నాం” అంటూ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రతీకార సుంకాల విషయంలో ప్రత్యామ్నాయ చట్టాలను ఉపయోగిస్తామని, వాటికి కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదని స్పష్టం చేశారు. అమెరికా చట్టసభల సంయుక్త సమావేశంలో ఆయన 100 నిమిషాలకు పైగా ప్రసంగిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మంది అనుకుంటున్నదానికంటే బలంగా ఉందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తమకే మద్దతు ఇవ్వాలని పరోక్షంగా పిలుపునిచ్చారు. సభలో యుద్ధ వీరులు, ఒలింపిక్స్ హాకీ బృందాన్ని పరిచయం చేసి, గోల్‌కీపర్ హెల్బ్యూక్కు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం’ ప్రకటించారు.
ఇరాన్ సమస్యను దౌత్య మార్గంలో పరిష్కరించాలని తన లక్ష్యమని ట్రంప్ తెలిపారు. భారత్–పాకిస్థాన్ యుద్ధాన్ని తాను ఆపకపోతే 3.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయేవారని పాక్ ప్రధాని తనను ప్రశంసించారని చెప్పారు. సుంకాలు దేశాన్ని రక్షిస్తున్నాయని ఆయన సమర్థించగా, వాటిని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని విమర్శించారు. డెమోక్రాట్లు దేశాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!