
రాజకీయాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపిస్తూ భారత్ సుంకాల విధానంపై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వైట్ హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ట్రంప్, మోదీ తనకు ఎంతో ఇష్టమని, గొప్ప స్నేహితుడని పేర్కొన్నారు. భారత్-అమెరికా మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత సంబంధాలను కూడా ఆయన ప్రస్తావించారు.
వాణిజ్య చర్చలపై స్పందిస్తూ, భారత్ గతంలో అమెరికాపై అధిక సుంకాలు విధించి లాభపడిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారి, అమెరికా భారత్ నుంచి లాభాలు పొందుతోందని అన్నారు. ఇరుదేశాల మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పాటు జరిగిన చర్చల్లో వాణిజ్యం, కస్టమ్స్, సౌలభ్యం, టారిఫేతర చర్యలు, ఆర్థిక భద్రత వంటి అంశాలపై చర్చించినట్లు వాణిజ్య శాఖ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!