
జనరల్

న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనలు ఉధృతం కావడంతో జంతర్‌మంతర్ పరిసర ప్రాంతాల్లో అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంటర్నెట్ ఆంక్షలపై యువత పోలీసులను నిలదీసింది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొందరు నిరసనకారులు రాళ్లు రువ్వినట్లు సమాచారం. అనంతరం గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రస్తుతం అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేసి పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!