

తిరుపతిలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీపీఐ జాతీయ నేత కె. నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు. సీబీఐ, సిట్ విచారణలు పూర్తయ్యి నివేదికలు సమర్పించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా ఏకసభ్య కమిషన్ నియమించడం సరైంది కాదని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామిని ఉపయోగిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విచారణల పేరుతో కాలయాపన చేస్తూ అసలు నిందితులను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నారాయణ ఆరోపించారు. తప్పు జరిగిందన్న విషయం అందరికీ తెలిసినదేనని పేర్కొంటూ, పరస్పరం నిందారోపణలు చేసుకోవడం మానుకుని భక్తుల భావాలను గౌరవించాలని సూచించారు. నిందితులకు తగిన శిక్ష పడేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!