

దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మరో 4.5 లక్షల మంది అర్హులకు కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు తన నియోజకవర్గమైన కోడంగల్‌లో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క పాల్గొననున్నారు.
వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులు తదితర వర్గాలకు చెందిన అర్హులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నారు. కోడంగల్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కొంతమంది నూతన లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేస్తారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు. కొత్తగా పింఛన్లు మంజూరైన వారందరికీ ఈ నెల నుంచే పింఛను చెల్లింపులు ప్రారంభం కానున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!