

తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తూ, కేవలం మద్దతు ధర (MSP) ప్రకటించి బాధ్యత నుంచి తప్పుకుంటోందని అన్నారు. ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం రికార్డులు సృష్టిస్తోందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల విధానాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతోనే ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు సుమారు 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేస్తున్నామని తెలిపారు. మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మెరుగ్గా ఉందని ఆయన అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!