
.jpg&w=3840&q=75)
టీటీడీకి సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో కుట్ర కోణం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2019 నుంచి 2024 మధ్య దేవాలయాల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తీసుకున్న కీలక నిర్ణయాల్లో టీటీడీ ఈవో నియామకం ఒకటని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై తనకు అపార భక్తి ఉందని, సిద్ధాంతాల కోసం పోరాడిన తనపై గతంలో దాడులు జరిగినా వెనుకడుగు వేయలేదని పేర్కొన్నారు.
సుమారు 59 లక్షల కిలోల నెయ్యి కల్తీ జరిగినట్లు ఆరోపిస్తూ, దీనివెనుక ఒక సిండికేట్ పనిచేసిందని సీఎం అన్నారు. ఎన్డీడీబీ నివేదిక అందిన తర్వాత చర్యలు ప్రారంభించామని, సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు వివరించారు. 2020లో టెండర్ నిబంధనలు మార్చడం, 2022లో వచ్చిన ఫిర్యాదులు, అనంతర విచారణల తర్వాత 2024 జూలైలో నివేదిక వెలుగులోకి వచ్చిందన్నారు. పాలు తయారు చేయలేని సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారని, ప్రమాదకర రసాయనాలు మరియు జంతు కొవ్వు కలిసిన నెయ్యి తయారీ జరిగిందని ఆరోపిస్తూ అవినీతి, కుట్ర అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
.webp&w=3840&q=75)







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!