16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలవరం–నల్లమలసాగర్ విస్తరణ కు వ్యతిరేకంగా తెలంగాణ అడుగులు

Writer: Venkatesh 05:33 AM, 5 జనవరి, 2026
పోలవరం–నల్లమలసాగర్ విస్తరణ కు వ్యతిరేకంగా తెలంగాణ అడుగులు

గోదావరి నది పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం–నల్లమలసాగర్ విస్తరణ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయపరమైన చర్యలను మరింత వేగవంతం చేసింది. ఈ అంశం పై సీనియర్ న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చలు జరుపుతూ, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది.

ఇటీవల ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, దాఖలు చేసిన రిట్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తో ముంబైలోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థవంతమైన వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులకు సూచించారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు, సాంకేతిక వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచర్ల లేదా నల్లమలసాగర్‌కు నీటిని లింక్ చేసేలా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మొదట ఆమోదం పొందిన ప్రాజెక్టు రూపకల్పనకే పరిమితంగా పనులు జరగాలని, కొత్తగా చేపడుతున్న విస్తరణలు చట్టబద్ధం కావని పిటిషన్‌లో స్పష్టం చేసింది.

తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమలసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ–ఫీజిబిలిటీ నివేదికలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ అంశం పై కేంద్ర జల సంఘం, కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, గోదావరి నీటి యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది.

అలాగే కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డీపీఆర్ తయారీకి ముందుకు వెళ్తోందని, వెంటనే ఈ చర్యలను నిలిపివేయాలని పిటిషన్‌లో పేర్కొంది. పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు

ఏపీలో ఎన్నికల పర్యవేక్షణకు 28 మంది ఐఏఎస్‌లు..

ఏపీలో ఎన్నికల పర్యవేక్షణకు 28 మంది ఐఏఎస్‌లు..

కెనడాను విచ్ఛిన్నం చేయాలని అమెరికా చూస్తోంది.. మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు

కెనడాను విచ్ఛిన్నం చేయాలని అమెరికా చూస్తోంది.. మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు

విశాఖ, విజయనగరం మేయర్ అభ్యర్థులుగా వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణి

విశాఖ, విజయనగరం మేయర్ అభ్యర్థులుగా వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణి

ట్యాగ్లు
పోలవరం ప్రాజెక్టునల్లమలసాగర్తెలంగాణ ప్రభుత్వంసుప్రీంకోర్టు కేసురేవంత్ రెడ్డినీటిపారుదల వివాదంగోదావరి జలాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పైడిపల్లిలో విద్యుత్ సమస్యలకు చెక్...
జనరల్

పైడిపల్లిలో విద్యుత్ సమస్యలకు చెక్...

రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!
జనరల్

రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!
జనరల్

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?
ఓటీటీ

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి
జనరల్

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...
రాజకీయాలు

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
జనరల్

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి
సినిమాలు

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!
జనరల్

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!