

తెలంగాణలో మావోయిస్టులపై చర్యల్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబి) కీలక పాత్ర పోషిస్తూ గణనీయమైన ఫలితాలు సాధించింది. ఎస్ఐబి ఏర్పాటు అయిన తరువాత అనేక ఆపరేషన్లు నిర్వహించగా, సోర్స్ బిల్డింగ్‌తో పాటు ఇంటెలిజెన్స్ సేకరణలో విస్తృతంగా పనిచేసింది. ఇప్పటి వరకు మొత్తం 14,078 మంది మావోయిస్టు క్యాడర్లను అరెస్ట్ చేయగా, 5,865 మంది లొంగుబాటు చేశారు. అలాగే 1,057 ఎన్కౌంటర్ ఘటనల్లో 1,289 మంది మావోయిస్టులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా కేంద్ర కమిటీ స్థాయి మావోయిస్టులపై సమాచారం సేకరణలో తెలంగాణ ఎస్ఐబి కీలకంగా వ్యవహరించింది. మొత్తం 23 మంది కేంద్ర కమిటీ సభ్యుల వివరాలు గుర్తించగా, వారిలో 7 మంది అరెస్టు, 7 మంది లొంగుబాటు, 9 మంది ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సమాచారం. మొత్తంగా 21,232 మంది మావోయిస్టులపై తీసుకున్న చర్యల్లో ఎస్ఐబి ప్రధాన పాత్ర పోషించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!