

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ విజయం సామాజిక న్యాయం, గౌరవం, సమగ్ర అభివృద్ధి ఆధారంగా ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు లభించిన మద్దతు అని ఆయన పేర్కొన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, నాయకుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ విజయం కార్యకర్తలదే కాకుండా తెలంగాణ ప్రజలదని స్పష్టం చేశారు. “ప్రజల తెలంగాణ” లక్ష్యం పట్ల తమ నిబద్ధత ఎప్పటికీ మారదని తెలిపారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ట్వీట్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు అభినందనలు తెలిపారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత, నిరంతర అభివృద్ధి లక్ష్యాలతో 3.8 కోట్ల ప్రజల కోసం కట్టుబడి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పు ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!