
జనరల్

టీవీకే అధినేత విజయ్ తమిళనాడులో 12వ తరగతి ఫలితాలు విడుదలైన సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా నిరాశ చెందవద్దని, ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. “కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే విజయం దక్కుతుంది” అని పేర్కొన్న విజయ్, “మంచి జరగబోతోంది.. విజయం తథ్యం” అంటూ విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.
అయితే విజయ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో టీవీకే రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తున్న సమయంలో ఆయన చేసిన “విజయం తథ్యం” వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఇది కేవలం విద్యార్థులకు ఇచ్చిన సందేశమా లేక రాజకీయ సంకేతమా అన్న దానిపై చర్చ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!