

ఆంధ్రప్రదేశ్ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్రపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం శ్రీశైలంలో మాట్లాడుతూ, పాదయాత్రలు చేసినంత మాత్రాన చేసిన పాపాలు పోవని, ఆ పాపాలు జగన్ వెంటే ఉంటాయని విమర్శించారు. ప్రజలకు ఏం తక్కువైందని మీరు పాదయాత్ర చేయబోతున్నారని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమికి 164 సీట్లు వస్తే, అందులో వైసీపీ కార్యకర్తల ఓట్లు కూడా ఉన్నాయని జగన్ గ్రహించాలని సూచించారు.
ఈ పాదయాత్ర ప్రజల కోసమా లేక కార్యకర్తల కోసమా చెప్పాలని జగన్‌ను ఆయన ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఫైనల్ చార్జ్‌షీట్ దాఖలు అయిన నేపథ్యంలో శ్రీశైలం ఆలయంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వం చేసిన పాపాలు తొలగిపోవాలని మల్లిఖార్జున స్వామి, అమ్మవార్లకు ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. తిరుమలలో ఆదాయం ఎక్కువగా ఉండటంతో అక్రమాలు జరిగాయని, దేవుడి దయతో శ్రీశైలంలో అలాంటివి జరగలేదని అన్నారు. వైసీపీ నాయకుల్లో మంచి బుద్ధి రావాలని, మార్పు కలగాలని దేవుడిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.



.jpg&w=3840&q=75)










.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!