

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దూషణలకు సంబంధించిన కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు స్లీప్ అప్నియా పరికరం సహాయంతో విశ్రాంతి తీసుకుంటున్నారని జైలు అధికారులు తెలిపారు.శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు సాధారణంగా ఈ పరికరాన్ని ఉపయోగిస్తారని వైద్యులు పేర్కొంటున్నారు. నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా శ్వాస తీసుకునే స్థాయి తగ్గిపోవడం, ఆ తర్వాత మళ్లీ సాధారణ స్థితికి రావడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయని చెప్పారు.
ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలో ఆక్సిజన్ స్థాయి ప్రమాదకరంగా తగ్గకుండా ఉండేందుకు స్లీప్ అప్నియా పరికరం సహాయపడుతుందని వైద్యులు వివరించారు. ఈ సమస్య ఎప్పుడు తలెత్తుతుందో ముందుగా చెప్పలేని కారణంగా, నిద్రపోయే ముందు ఈ పరికరాన్ని అమర్చుకుంటారని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు అంబటి రాంబాబుకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పిస్తూ, ఈ పరికరాన్ని సమకూర్చినట్లు జైలు అధికారులు వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!