
గాసిప్స్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసు జారీ చేసింది. ఆదివారం జరిగే విచారణకు హాజరుకావాలని సిట్ ఆదేశించింది. నంది నగర్ నివాసంలోని కేసీఆర్ ఇంటి గోడకు సిట్ నోటీసులు అతికించింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు నంది నగర్లో అందుబాటులో ఉండాలని సూచించింది.
ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ను నంది నగర్లో విచారించనున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటీసు ప్రాధాన్యం సంతరించుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!