

పశ్చిమ బెంగాల్ సింగూర్‌లో ఆదివారం పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడ నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరియు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న “జంగిల్ రాజ్‌కు” త్వరలోనే వీడ్కోలు చెబుతామని పేర్కొంటూ, పశ్చిమ బెంగాల్లో తప్పనిసరిగా మార్పు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకే దక్కిందని, ఆజాద్ హింద్ ఫౌజ్‌కు ఎర్రకోట సమీపంలో తొలిసారి గౌరవం లభించిందని తెలిపారు. అలాగే అండమాన్ – నికోబార్ దీవుల్లోని ఒక దీవికి నేతాజీ పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే బెంగాలీ భాషకు క్లాసికల్ భాష హోదా దక్కిందని, దుర్గా మాత పూజకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ రావడంలో కూడా కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉందని మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. ముఖ్యంగా మత్స్యకారులకు సరైన సహాయం అందడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే కేంద్ర పథకాల లాభాలు వారికి చేరడం లేదన్నారు. బెంగాల్ ప్రజలు “క్రూరమైన టీఎంసీ ప్రభుత్వానికి” గుణపాఠం చెప్పాలని, బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. “బెంగాల్ ప్రజల భవిష్యత్తు బాగుండాలా? రాష్ట్రం క్షేమంగా ఉండాలా?” అని ప్రశ్నిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!