
రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న పంచాయతీ ఎన్నికలు దశల వారీగా వేగం పుంజుకుంటున్నాయి. మూడు విడతలుగా జరగనున్న ఎన్నికల్లో, ఇప్పటికే రెండు దశల నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా, డిసెంబర్ 11న జరగబోయే తొలి దశ పోలింగ్‌కు అభ్యర్థుల గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా కేటాయించింది.
గుర్తులు ప్రకటించడంతో గ్రామీణ రాజకీయ రంగం మరింత రసవత్తరంగా మారింది. అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేస్తూ… తమ తమ గుర్తులను ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.
పార్టీల రంగు పెద్దగా ప్రభావితం చేయని పంచాయతీ ఎన్నికల్లో, అభ్యర్థుల వ్యక్తిత్వం, గ్రామానికి ఇచ్చే హామీలు కీలకపాత్ర పోషించనున్నాయి.
ఒక్క అవకాశం ఇస్తే గ్రామాన్ని మారుస్తామని, అభివృద్ధి పనులను స్పష్టంగా చూపిస్తామని అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక మూడవ విడత ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభమైంది.
తొలి దశ పోలింగ్ – డిసెంబర్ 11
రెండో దశ పోలింగ్ – డిసెంబర్ 14
మూడో దశ పోలింగ్ – డిసెంబర్ 17
గ్రామాల్లో ఎన్నికల వేడి పెరుగుతున్న తరుణంలో, ప్రతి విడత పోలింగ్‌పై రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!