
సినిమాలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాజంలో జరుగుతున్న అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్ భరత్‌కు మద్దతు ప్రకటించారు. తన ఆటోపై హిందూ ధర్మానికి సంబంధించిన సందేశాలు రాసుకున్నందుకు అతను వేధింపులకు గురయ్యాడని పేర్కొన్నారు. వ్యక్తిగత విశ్వాసాన్ని వ్యక్తపరచడం ప్రతి ఒక్కరి హక్కు అని, ఆ హక్కును ఎవరూ హరించలేరని ఆయన స్పష్టం చేశారు.
భరత్‌పై జరిగిన దాడిని ఖండించిన సంజయ్, అతనికి పూర్తి సహాయం అందిస్తామని తెలిపారు. ధ్వంసమైన ఆటో స్థానంలో కొత్త ఆటోను అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ ఘటనకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హిందూ సమాజం భరత్‌కు అండగా నిలుస్తుందని ఆయన అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!