
న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబై పర్యటనలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను కలిసారు. మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబంలో జరిగిన వివాహ వేడుకలో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించారు. సంక్షిప్తమైన ఈ భేటీలో రేవంత్ రెడ్డి, సల్మాన్ ఖాన్ వివిధ అంశాలపై చర్చించినట్టు సమాచారం. రాజకీయాలు, సినిమా, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వంటి విషయాలపై ఇద్దరూ ముచ్చటించినట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను ప్రశంసించి, రేవంత్ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన పురోగతిపై అభినందనలు తెలిపారట.
వీరిద్దరి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు దక్షిణాది రాజకీయ నాయకుడు – మరోవైపు బాలీవుడ్ సూపర్‌స్టార్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (2)
సౌత్ పాలిటిక్స్ & బాలీవుడ్ గ్లామర్ ఒకే ఫ్రేమ్‌లో
Wow! Great to see both in one frame