
రాజకీయాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన సైనిక చర్యకు ఆ దేశ సెనెట్ మద్దతు తెలిపింది. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరాన్‌పై సైనిక చర్యలను కొనసాగించే అధ్యక్ష అధికారాలను పరిమితం చేయాలని డెమోక్రటిక్ సభ్యుడు టిమ్ కైన్ ప్రవేశపెట్టిన తీర్మానం సెనెట్‌లో ఆమోదం పొందలేదు. ట్రంప్ నిర్ణయానికి మద్దతుగా 53 మంది ఓటు వేయగా, 47 మంది వ్యతిరేకించారు. రిపబ్లికన్ సభ్యుడు రాండ్ పాల్ అనుకూలంగా, డెమోక్రటిక్ సభ్యుడు జాన్ ఫెట్టర్మన్ వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో అధ్యక్షుడి సైనిక చర్యలకు సెనెట్ మద్దతు లభించినట్టైంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!