

ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వాతావరణం మళ్లీ ఉత్సాహంగా మారుతున్న సూచనలు దర్శనమిస్తున్నాయి. అయిదేళ్ల విరామం తర్వాత ప్రముఖ పునరుత్పత్తి శక్తి సంస్థ రీన్యూ పవర్ మళ్లీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వస్తోంది. ఈరోజు ఉదయం మంత్రి నారా లోకేష్ X లో చేసిన ప్రకటన దీనికి బలమవుతోంది. “రాష్ట్రానికి మరొక భారీ పెట్టుబడి రాబోతోంది” అని ఉదయం ముందుగానే సూచించిన లోకేష్, సరిగ్గా 9 గంటలకు పూర్తి వివరాలు వెల్లడించారు.
రీన్యూ పవర్ మొత్తం ₹82,000 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లో విస్తృతమైన పునరుత్పత్తి శక్తి ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సోలార్ ఇంగాట్, వాఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి వంటి అత్యాధునిక రంగాల్లో కంపెనీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం రాష్ట్రానికి గర్వకారణమని లోకేష్ పేర్కొన్నారు.
ఈ పెట్టుబడులు ఏపీకి భారీ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మరియు సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి దోహదం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!