
క్రీడలు

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కు బుధవారం భారత సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసుపై విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తూ ధర్మాసనం స్టే మంజూరు చేసింది. తనపై ఈడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, వరుసగా సమన్లు జారీ చేయకుండా ఆపాలని కోరుతూ సొరేన్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది.
స్టే మంజూరు చేయడంతో పాటు వివరణ ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భూమి కుంభకోణంలో అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టులో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని సొరేన్ మొదట ట్రయల్ కోర్టు, తర్వాత హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!