
జనరల్

తమిళనాడులో మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ ప్రభుత్వంపై ఇటీవల రాజకీయ గందరగోళం నెలకొంది. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చనున్నారన్న వార్తలు వెలువడటంతో మిత్రపక్షాల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ అంశంపై వీసీకే, వామపక్ష పార్టీలు స్పందిస్తూ వ్యతిరేకత వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున స్పందిస్తూ ఆ వార్తలను ఖండించారు. రెబల్ ఎమ్మెల్యేలకు క్యాబినెట్ పదవులు ఇవ్వనున్నారన్నది పూర్తిగా ఊహాగానమని ఆయన స్పష్టం చేశారు. మిత్రపక్షాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలతో పాటు పలువురు రెబల్ ఎమ్మెల్యేల మద్దతు కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!