

అమెరికా, రష్యా, చైనా దేశాల మధ్య జరిగినట్లు పేర్కొంటున్న త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన చిత్రాన్ని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే భారత ప్రధానమంత్రి కూడా డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, షి జిన్‌పింగ్‌లతో కలిసి ఆ బల్లపై కూర్చునేవారని వ్యాఖ్యానించారు. అమెరికాతో సంబంధాల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాలపై రాజీ పడుతున్నారని ఆరోపించారు. ఇతర దేశాలకు లోబడి ఉన్నంతకాలం భారత ప్రధానికి ఇలాంటి అంతర్జాతీయ భేటీల్లో చోటు దక్కదని విమర్శించారు. జాతీయ ప్రయోజనాలను కేంద్రం రోజురోజుకూ తాకట్టు పెడుతోందని, ‘విశ్వగురు’ ప్రచారంతో వాస్తవాలను కప్పిపుచ్చుతోందని మండిపడ్డారు.
షికాగో విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో పాకిస్థాన్‌కు చెందిన విద్యార్థి భారత్, పాక్ పరస్పరం నిందించుకోకుండా ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పనిచేయగలవా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. పొరుగు దేశంతో స్నేహపూర్వక సంబంధాలనే భారత్ కోరుకుంటోందని తెలిపారు. అయితే ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు ఇవ్వడమే ఇరు దేశాల మధ్య చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. ఇస్లామాబాద్ మద్దతుతో ఉగ్రవాదులు భారత అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నప్పుడు ఆ దేశంతో చర్చలు ఎలా జరుపుతామని ప్రశ్నించారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం పూర్తిగా నిలిపివేసినప్పుడే స్నేహపూర్వక సంబంధాలకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!