

నాగచైతన్య, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వృశకర్మ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 5,000 ఏళ్ల పురాతన గుహ తవ్వకాల నేపథ్యంలో సాగుతుంది. ఆ తవ్వకాల సమయంలో మానవ అవగాహనకు, ఆధునిక శాస్త్రానికి అందని ఓ భయంకరమైన శక్తి బయటపడుతుంది. ఇందులో పరిశోధకుడిగా కనిపించిన నాగచైతన్య.. వేద విజ్ఞానం ద్వారా విశ్వ క్రమాన్ని పునరుద్ధరించాల్సిన రక్షకుడిగా తన పాత్రలో ఆకట్టుకున్నారు. రగ్గడ్ లుక్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో ఆయన సరికొత్తగా కనిపించారు.
గతంలో విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు కార్తీక్ దండు.. ఈ చిత్రంలోనూ మిస్టరీ, క్షుద్రశక్తుల నేపథ్యంతో కూడిన ఉత్కంఠభరిత వాతావరణాన్ని చూపించారు. బి. అజనీష్ లోక్‌నాథ్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు మరింత బలాన్ని చేకూర్చింది. స్పర్శ్ శ్రీవాస్తవ లుక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్రైలర్‌లోని ఆసక్తికరమైన అంశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పలు భాషల్లో విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!