
జనరల్

ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల ఓ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారితీశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన కొన్ని విషయాలను ఆయన ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా వైఎస్ జగన్, చంద్రబాబు పేర్లు ప్రస్తావించడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్ అయింది.
ఈ వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తెలంగాణ జనసేన ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని పవన్ కళ్యాణ్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గుర్తింపు కోసం ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!