

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటివరకు నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, పది కోట్ల కుటుంబాలకు కొత్తగా ఎల్పీజీ కనెక్షన్లు అందించామని తెలిపారు. అలాగే, ప్రపంచంలో ధాన్య ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో, ఆక్వా రంగంలో రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
ఉత్పత్తి రంగంలో చేపట్టిన కీలక సంస్కరణల వల్ల దేశంలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని ఆమె వివరించారు. ఈ చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమై అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలకు శుభారంభం లభించగా, ఫిబ్రవరి 1 న లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందుగా పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనుండగా, దేశ ఆర్థిక పరిస్థితిపై సమగ్ర అవలోకనం అందించనుంది. ఈ సమావేశాల్లో కీలక ఆర్థిక అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!