
జనరల్

ఇండి కూటమి సమావేశం నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రధాన కూడళ్లలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని విమర్శిస్తూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తూ, కూటమి అంతర్గత విభేదాలపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
ఈ పోస్టర్లలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం గమనార్హం. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!