

బంగ్లాదేశ్లో ఈ రోజు దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. పలు సంవత్సరాల రాజకీయ అస్థిరత అనంతరం జరుగుతున్న ఈ ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ఉదయం 7:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:30 గంటలకు ముగియనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమై అర్ధరాత్రి నాటికి ట్రెండ్లు వెల్లడయ్యే అవకాశం ఉందని, తుది ఫలితాలు రేపు (ఫిబ్రవరి 13) ఉదయం వరకు స్పష్టమయ్యే అవకాశముందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 2024లో మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రభుత్వం పదవీచ్యుతి అయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. అప్పటి నుంచి ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని 18 నెలల తాత్కాలిక పాలన కొనసాగింది. ఈసారి సుమారు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు.
ఇక భద్రతా పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దాదాపు 50 శాతం పోలింగ్ బూత్ల వద్ద ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేయడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజధాని ఢాకాలో పోలీసులు బాడీ కెమెరాలు ధరించి మోహరించారు. అలాగే దేశవ్యాప్తంగా సుమారు 90 శాతం పోలింగ్ కేంద్రాలు సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!