
జనరల్

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఎం) తమిళనాడు ప్రభుత్వానికి కీలక హెచ్చరిక జారీ చేసింది. ఏఐఏడీఎంకే లేదా దాని తిరుగుబాటు వర్గాలను మంత్రివర్గంలో చేర్చితే టీవీకే ప్రభుత్వానికి ఇచ్చిన బయటి మద్దతును ఉపసంహరించుకుంటామని తెలిపింది.
తిరువారూరులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. శణ్ముగం మాట్లాడుతూ, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు డీఎంకే , ఏఐఏడీఎంకే రెండింటినీ తిరస్కరించారని, అందువల్ల ఏఐఏడీఎంకే తో కలవడం ప్రజా తీర్పుకు విరుద్ధమని అన్నారు. రాజకీయ అస్థిరత, బీజేపీ ప్రభావం నివారించేందుకు టీవీకేకు మద్దతు ఇచ్చామని, కానీ ఏఐఏడీఎంకే నేతలకు మంత్రిపదవులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు టీవీకే ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రాలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!