
సినిమాలు

తమిళనాడు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం అన్నామలై ‘వీ ది లీడర్స్’ (We The Leaders) పేరుతో కొత్త ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. నాయకత్వ వికాసం, పాలన, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ వంటి అంశాలపై దృష్టి సారిస్తూ ఈ వేదికను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రారంభమైన తొలి రోజే 10 లక్షలకు పైగా నమోదులు వచ్చినట్లు సమాచారం.
అయితే ఈ ఉద్యమంపై టీవీకే నేత, తమిళనాడు ఆరోగ్య మంత్రి కే.జి. అరుణ్‌రాజ్ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. ‘ఇది కొత్తది కాదు.. బీజేపీ రీ-రిలీజ్ మాత్రమే’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రతి రీ-రిలీజ్ సినిమాను ప్రజలు చూడరని సెటైర్ వేశారు. అన్నామలై బీజేపీని వీడి కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!