
జనరల్

రామచందర్రావు బండి సంజయ్కు సంబంధించిన వివాదంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ తప్పు చేసి ఉంటే పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని, అయితే ప్రస్తుతం ఆయన ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు తప్పు చేసి ఉంటే న్యాయపరంగా వ్యవహరిస్తారని చెప్పారు. ముందస్తు బెయిల్ తీసుకోవడం ప్రతి పౌరుడికి ఉన్న హక్కు అని ఆయన స్పష్టం చేశారు.
బండి సంజయ్ లేదా ఆయన కుటుంబ సభ్యులు పారిపోలేదని, బెయిల్ పిటిషన్ ప్రస్తుతం పెండింగ్లో ఉందని తెలిపారు. భగీరథ్ ఇప్పటికే లొంగిపోయాడని పేర్కొంటూ, ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు భారత్ రాష్ట్ర సమితి కోట్ల రూపాయలు ఖర్చు చేసి బండి సంజయ్, ఆయన కుమారుడిపై ప్రచారం చేస్తోందని ఆరోపించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!