

తుర్కియే పార్లమెంటులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్త న్యాయశాఖ మంత్రి నియామకాన్ని వ్యతిరేకిస్తూ అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం తోసుకుని దాడులకు దిగారు. ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన అకిన్ గుర్లెక్‌ను న్యాయశాఖ మంత్రిగా అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నియమించడంతో వివాదం చెలరేగింది. బుధవారం గుర్లెక్ ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతుండగా, ప్రతిపక్ష నేతలు పోడియం వద్దకు దూసుకొచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో స్పీకర్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం భద్రత నడుమ అధికార పార్టీ నేతలు గుర్లెక్తో ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ నియామకంపై ప్రధాన ప్రతిపక్షమైన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గుర్లెక్ ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న సమయంలో సీహెచ్‌పీ నేతలకు సంబంధించిన అనేక కేసులను పర్యవేక్షించారని ఆరోపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకునేందుకే ఈ నియామకం జరిగిందని, ఇది న్యాయ స్వేచ్ఛకు ముప్పుగా మారుతుందని సీహెచ్‌పీ విమర్శలు గుప్పించింది. ఈ ఘటన తుర్కియే రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతకు దారితీస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!